
ఎన్నికల హామీలపై నిలదీయండి
కనిగిరిరూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కల్లిబొల్లి మాటలతో సుపరిపాలన పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న కూటమి నేతలను పార్టీ శ్రేణులు, ప్రజలు.. హామీలు ఏమయ్యాయో నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో బాబు షూరిటీ–మోసం గ్యారంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కు సంబంధించి క్యూర్ కోడ్ కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే గఫార్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో శివ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మోసం, వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు, మరో 143 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి.. ఏడాదైనా వాటిని అమలు చేయకుండా తీవ్ర మోసం చేస్తున్నాడని విమర్శించారు. 2014, 2024 రెండు దఫాలు అబద్ధాల, మోస పూరిత హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి.. ప్రజా మన్ననలు పొందిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ 2.0 పాలనలో ప్రతి కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. కనిగిరిలో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కొరవ లేదని.. పార్టీ విజయానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు:
బూచేపల్లి వెంకాయమ్మ
కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. అటువంటి వాటికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడరని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరన్నారు. సుపరిపాలన పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న నేతలను హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఎవరూ ఎల్లప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండరని.. మారుతుంటాయని.. అధికార పార్టీ నాయకులు అది గమనించుకుని.. వేధింపులు మానుకుని పథకాల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. బొద్దింకలు, వెంట్రుకల ఉన్న భోజనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెడుతున్నారని మండిపడ్డారు.
కూటమి మోసాలను ప్రజలకు వివరించాలి: దద్దాల నారాయణ యాదవ్
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు వివరించేందుకు పార్టీ నేతలు, శ్రేణులు, అంతా సమష్టిగా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేలా పనిచేద్దామన్నారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురేద్దామన్నారు.
పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు: బత్తుల, కదిరి
కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చారని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, విశాఖపట్నం పరిశీలకుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు సున్నం పెట్టారని విమర్శించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలన పేరుతో గ్రామాల్లోకి వస్తున్న టీడీపీ నేతలను యువకులు నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాలు ఎక్కడా అని..? మహిళలు ఉచిత బస్సు ఏదీ అని..? విద్యార్థులు తల్లులు తల్లికి వందనం బిడ్డలందరికీ ఎందుకు ఇవ్వలేదనీ..? భరోసా, బీమా ఎక్కడా అని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు గుంటక తిరుపతిరెడ్డి, కస్తూరిరెడ్డి, పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, చింతంగుంట్ల సాల్మన్, వైఎం సరితా ప్రసాద్‌రెడ్డి, గంగసాని హుస్సేన్‌రెడ్డి, డాక్టర్ రసూల్, రహీం, సిద్దారెడ్డి, ఎస్‌కే జిలాని, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్ నరసారెడ్డి, శ్రీహరిరెడ్డి, కాకర్ల వెంకటేశ్వర్లు, జీ ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, గట్టా విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మేకల శ్రీనివాస్ యాదవ్, చప్పిడి వెంకట సుబ్బయ్య, లక్ష్మీకాంతం రెడ్డి, ఎంపీపీలు గాయం సావిత్రి, మూడమంచు వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్‌కే చాంద్‌బాషా, యక్కంటి శ్రీను, జీ బొర్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, పాలుగుల్ల మల్లి కార్జునరెడ్డి, వైస్ ఎంపీపీలు దుగ్గిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, భూమిరెడ్డి వెంకటరెడ్డి, ముత్యాల నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీలు గాయం బలరాంరెడ్డి, భువనగిరి వెంకటయ్య, గట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌కే బుజ్జీ, ఆవుల భాస్కర్, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, పోలు జయరాంరెడ్డి, మితికల గురవయ్య, సాయి, పల్నాటి భాస్కర్‌రెడ్డి, వాకుమళ్ల రాజశేఖరరెడ్డి, ఎం నాగమణి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలపై నిలదీయండి