
మంత్రి స్వామికి సమస్యల స్వాగతం
సింగరాయకొండ:
మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ టీపీ నగర్, అప్పాపురం ఎస్టీకాలనీలో సోమవారం రాత్రి రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి నిర్వహించిన సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో గ్రామస్తుల నుంచి సమస్యలు స్వాగతం పలికాయి. పింఛన్ మంజూరు కాలేదని, తల్లికి వందనం డబ్బులు రాలేదని, ఇళ్లు మంజూరు కాలేదని పలువురు ప్రజలు మంత్రికి ఏకరువు పెట్టారు. ఆధార్‌కార్డు లేక ప్రభుత్వ పథకాలు రావడం లేదని, ఆధార్‌కార్డు మంజూరు చేయించాలని ఎస్టీలు మంత్రికి విన్నవించుకున్నారు. వెంటనే పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని మంత్రి స్వామి అధికారులకు సూచించారు. టీపీ నగర్, అప్పాపురంలో సుమారు 1300 గృహాలుండగా, మంత్రి స్వామి కేవలం 300 గృహాలే తిరిగారని, తమ గృహాలకు రాలేదని టీపీ నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.