
వైద్య రంగంలో ఆరోగ్య శ్రీ విప్లవం...
వైద్యారోగ్య రంగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, 108, 104 లాంటివి ఎందరో నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చాయి. జిల్లాలో 43 కార్పొరేట్ ఆస్పత్రులు, 64 పీహెచ్‌సీలు, 11 సెకండరీ హెల్త్ ఆస్పత్రులు ఆరోగ్య నెట్‌వర్క్ ఆస్పత్రులుగా వైద్య సేవలు అందిస్తున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.25 లక్షల వరకు పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఆరోగ్య శ్రీని ఎత్తివేసేందుకు కుట్రలు మొదలు పెట్టింది. ఆస్పత్రులకు సకాలంలో బిల్లులను చెల్లించకుండా వేధిస్తోంది. ఆరోగ్య శ్రీని బీమా కిందకు తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది అమలులోకి వస్తే నిరుపేదలకు ఆరోగ్య శ్రీ సేవలు దూరమైనట్టే.