లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్టు
ముండ్లమూరు(కురిచేడు): పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముండ్లమూరు ఎస్సై కమలాకర్ తెలిపారు. మండలంలోని రమణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇస్తాల మణికంఠ అనే యువకుడు ఇటీవల ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఉల్లగల్లు గ్రామంలోని వేముల బస్టాండ్ వద్ద మణికంఠను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో బీహార్ వాసి మృతి
పొదిలి రూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాటూరి నారాయణరావు పశువుల ఫారంలో బీహార్‌కు చెందిన నితీష్‌కుమార్(45) పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాధ్యతలు చేపట్టిన డీఎల్‌డీఓ
మార్కాపురం: మార్కాపురం డీఎల్‌డీఓగా పి.బాలునాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా మాచర్లలో డీఆర్‌డీఏ క్లస్టర్ ఏపీడీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మార్కాపురం డీఎల్‌డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన డీఎల్‌డీఓకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని చెప్పారు.


