
ఆంగ్లభాషపై పట్టు పెంచుకునేందుకు ఉపయోగంగా ఉంది
ఆంగ్లభాషపై పట్టు పెంచుకునేందుకు ‘సాక్షి’ స్పెల్‌బీ ఎంతగానో ఉపయోగపడింది. నూతన పదాలను తెలుసుకోవడంతోపాటు వాటి ఉచ్ఛారణపై పట్టు సాధించడం, స్పెల్లింగ్‌ను అర్థం చేసుకోవడం వల్ల ఆంగ్ల ఉచ్ఛారణపై అవగాహన పెరిగింది. నిజంగా ఆంగ్లం పట్ల పిల్లల్లో ఉండే భయాన్ని పోగొట్టేందుకు ఈ ‘సాక్షి’ స్పెల్‌బీ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. – బి.సాయి విదీష
స్పెల్‌బీ ఎంతో ఉపయోగకరం
‘సాక్షి’ స్పెల్‌బీ పోటీలు మాకు ఎంతో ఉపయోగకరం. ఆంగ్లంలోని అనేక పదాల స్పెల్లింగ్స్‌ను తెలుసుకుంటూ వాటితోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకోవడం వల్ల ఆంగ్లంలో మాట్లాడడం సులువుగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– ఎస్.రీష్మసాయి భ్రమర
ఆంగ్లంపై పట్టు పెంచుకునేందుకు దోహదపడింది
‘సాక్షి’ స్పెల్‌బీ కార్యక్రమం ద్వారా ఆంగ్లంలో మాకు తెలియని అనేక పదాలను తెలుసుకోగలిగాను. వారు మెటీరియల్ కూడా ఇవ్వడంతో ఆ పదాలను నా అంతట నేను ఒంటరిగా ఉన్నప్పుడు చదువుకుంటూ డిక్షనరీని ఉపయోగించుకుని అర్థాలను తెలుసుకోగలిగాను. ఇది తప్పకుండా నాకు జీవితంలో ఎంతగానో తోడ్పడుతుంది. – పి.భార్గవ్
ఇందులో పాల్గొనడం ఒక మంచి అవకాశం
‘సాక్షి’ స్పెల్‌బీ పోటీల్లో పాల్గొనగలగడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. గ్రామర్‌పై పట్టు పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పోటీలు విద్యార్థులకు వారు జీవితంలో ఉన్నతంగా రాణించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– ఆర్.సమీర


