
రెజ్లింగ్ విజేతలను అభినందిస్తున్న ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.వనజ
ఒంగోలు: ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎన్‌టీఆర్ జిల్లాలో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన రెజ్లింగ్ క్రీడాకారులు సత్తాచాటారు. అండర్ 14 విభాగంలో బాలురు ఒక రజిత, రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. అండర్ 17 బాలుర ప్రీ స్టైల్, గ్రీకో రోమన్ విభాగంలో రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులు, జిల్లా జట్టు మేనేజర్, ఫిజికల్ డైరెక్టర్ షకీల, శిక్షకులు రవికుమార్‌లను జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీఎస్ సుబ్బారావు, కె.వనజ అభినందించారు.
వీఆర్‌ఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రంగయ్య
ఒంగోలు అర్బన్: వీఆర్‌ఓ సంఘ జిల్లా అధ్యక్షుడుగా ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న వైపీ రంగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రాము పదోన్నతిపై వెళ్లడంతో కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పోస్టులను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏసీహెచ్ ఆదిరెడ్డి, ప్రచార కార్యదర్శి కే జగదీష్, జాయింట్ సెక్రటరీ జి. బాదుర్ల, ఈసీ సభ్యులు జీ వినీల, కనిగిరి డివిజన్ అధ్యక్షుడుగా ఎం.రమేష్‌లను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. దీనిలో మాజీ అధ్యక్షుడు పీ రాము, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కందిమళ్ల వీరాంజనేయులు, జిల్లా, డివిజన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీఆర్‌ఓ సంఘ మాజీ జిల్లా అధ్యక్షుడు రాము