జాతీయ గీతం ఆలపిస్తున్న మార్కాపురం పట్టణవాసులు
మార్కాపురం: మార్కాపురం పట్టణ ప్రజలు దేశభక్తిని చాటుతున్నారు. ఇక్కడి పాత బస్టాండులోని గాంధీ పార్కులో గతేడాది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ మైక్ ఏర్పాటు చేసి రోజూ ఉదయం 8 గంటలకు జాతీయ గీతం ప్రసారమయ్యేలా ఏర్పాటు చేశారు. అయితే కొద్దిరోజులపాటే పుర ప్రజలు జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. తాజాగా వినాయక చవితి పర్వదినం నుంచి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటక సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. రోజూ సుమారు 20 మంది సరిగ్గా 8 గంటలకు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్దకు చేరుకుని మైకులో వినిపించే జాతీయ గీతంతో శృతికలుపుతూ రెండు నిమిషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తమవంతు కృషిచేస్తామని స్థానికులు పీవీ కృష్ణారావు, ఎల్‌ఐసీ శేషగిరిరావు, జె.శ్రీనివాసులు, బలరామ్, చెంచిరెడ్డి తదితరులు పేర్కొన్నారు.
మార్కాపురంలో రోజూ జాతీయ
గీతాలాపన
ఉదయం 8 గంటలకు
2 నిమిషాలపాటు ఎక్కడివారు అక్కడే..


