షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తున్న ఆర్‌ఐఓ సైమన్ విక్టర్, పీడీలు
ఒంగోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 క్రీడల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ మండలి పర్యవేక్షణాధికారి ఎ.సైమన్ విక్టర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి ఐ.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఆర్‌ఐఓ కార్యాలయంలో ఫిజికల్ డైరెక్టర్స్‌తో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అండర్–19 ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎం.ఆదినారాయణ, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు టి.సుబ్బారావు, కె.డేవిడ్‌రాజ్, జి.పుష్పరాజ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ వివరాలివీ..
స్థానిక ఏబీయం జూనియర్ కాలేజీ ఆవరణలో చెస్, కరాటే, రోప్ స్కిప్పింగ్–సెప్టెంబర్ 25న, సైక్లింగ్, జూడో, ఫెన్సింగ్– 26న, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, యోగా–27న, సెపక్‌తక్రా, బాల్‌బ్యాడ్మింటన్, క్యారమ్స్–30న నిర్వహించనున్నారు. ఈనెల 29న కబడ్డీ పోటీలను చీరాల ఎస్‌ఎంఎల్ జూనియర్ కాలేజీలో, ఖోఖో పోటీలను జె.పంగులూరు మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తారు. అక్టోబరు 3న బాక్సింగ్ పోటీలను ఒంగోలు మినీ స్టేడియంలో, అక్టోబరు 4న వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలను స్థానిక భారతీయ వ్యాయామ కళాశాలలో, అక్టోబరు 5న రెజ్లింగ్ పోటీలను దర్శిలోని ఏపీఎస్‌డబ్ల్యుఆర్ జూనియర్ కాలేజీలో, అక్టోబరు 6న వాలీబాల్, టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను సింగరాయకొండ జూనియర్ కాలేజీలో నిర్వహించనున్నారు. అక్టోబరు 4న హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, అక్టోబరు 5న క్రికెట్, అక్టోబరు 7న హాకీ, అక్టోబరు 27న అథ్లెటిక్స్ పోటీలను కందుకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించాలని నిర్ణయించారు.


