
పొగాకు బ్యారన్
పొగాకు సాగులో నూతన బ్యారన్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి లేదని బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఉన్న బ్యారన్ల లైసెన్స్‌లను ఒక రైతు నుంచి మరొక రైతు మార్చుకునే వెసులుబాటు ఉందే తప్ప కొత్తగా బ్యారన్ల లైసెన్స్‌లకు అనుమతి లేదు. ప్రస్తుతం ఉన్న బ్యారన్లను వచ్చే నెల 26వ తేదీలోపు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు.
సిఫార్సు చేసిన వంగడాలను మాత్రమే సాగు చేయాలి...
పొగాకు దిగుబడి బాగా రావడానికి, తెగుళ్లను తట్టుకుని నిలబడే విధంగా బోర్డు సిఫార్సు చేసిన పొగాకు వంగడాలనే సాగు చేయాలని రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. సిరి, ఎఫ్‌సీఆర్–15 వంగడాలు మేలు రకానికి చెందినవని బోర్డు అధికారులు ప్రకటించారు.