సాగు..బాగు | - | Sakshi
Sakshi News home page

సాగు..బాగు

Sep 21 2023 1:56 AM | Updated on Sep 21 2023 1:56 AM

- - Sakshi

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఇప్పుడే ఊపందుకుంటోంది. 15 రోజులుగా కురుస్తున్న వానలతో నాట్లు వేస్తున్నారు. ఈ వర్షాలు పంటలకు జీవం పోశాయి. రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అన్నదాతలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. జిల్లాలో ఈ సీజన్‌ లక్ష్యం 5,36,442 ఎకరాలు కాగా ఇప్పటి వరకు సాగైంది 1,36,600 ఎకరాలు. అధిక విస్తీర్ణంలో పత్తి, మిరప, పొగాకు సాగుచేస్తున్నారు.

వేములకోటలో సాగులో ఉన్న పత్తి పంట

మిర్చి, పత్తి సాగుచేశా

ఈ ఏడాది పత్తి, మిర్చి పది ఎకరాల్లో సాగు చేశాను. ఈ క్రాప్‌ కూడా నమోదు చేయించాను. వర్షాలు కురిస్తే మంచి దిగుబడులు వస్తాయని అనుకుంటున్నా. ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు చాలా ఉపయోగం.

– జే.ఆవులయ్య, రైతు, వేములకోట

ఈనెలాఖరు వరకు పంటలు వేసుకోవచ్చు

జిల్లాలో ఈ నెలాఖరు వరకు పంటలు సాగుచేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 15 వరకు జిల్లాలో 128.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 81.09 వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబరుకు సంబంధించి మొత్తం 366.2 మి.మీ వర్షం నమోదు కావాల్సి ఉండగా, 239 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరి, పత్తి, మిర్చి పంటలు సాగుచేసుకోవచ్చు.

– శ్రీనివాసరావు,

జేడీఏ, ఒంగోలు

మార్కాపురం: జూన్‌, జూలై, ఆగస్టు మధ్య వరకూ వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. గత వారం నుంచి జిల్లాలో వర్షాలు కురవటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో కురిసిన వర్షాలు పత్తి, కంది రైతులకు ఉపయోగపడ్డాయి. దీంతో పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలన్నీ ఆశాజనకంగా ఉండగా, ఈ నెలాఖరు వరకు పశ్చిమ ప్రాంతంతో పాటు జిల్లాలోని టంగుటూరు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, ఒంగోలు, ముండ్లమూరు, కొత్తపట్నం, దర్శి, తాళ్లూరు, త్రిపురాంతకం, దొనకొండ, కురిచేడు తదితర ప్రాంతాల్లో వరినాట్లు వేయనున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరినాట్లు వేశారు. ఈ వారంలో అధిక విస్తీర్ణంలో పత్తి, మిర్చి, పొగాకు పంటలు సాగు కానున్నాయి. జిల్లాలో మొత్తం 38 మండలాలు ఉండగా వ్యవసాయశాఖ పరంగా దర్శి, కనిగిరి, సింగరాయకొండ, ఒంగోలు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ నెల 9 నాటికి మొత్తం ఒక లక్షా 36 వేల 600 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఇలా...

జిల్లాలో ఖరీఫ్‌ లక్ష్యం 5,36,442 ఎకరాలకు గాను ఇప్పటి వరకు సాగైంది 1,36,600 ఎకరాలు. ఇందులో వరి 14,622 హెక్టార్లకు గానూ 2,733 హెక్టార్లు, జొన్న 233 హెక్టార్లకు గాను 30, సజ్జ 7,456 హెక్టార్లకు గాను 5,759, మొక్కజొన్న 1,834 గాను 2,035, కొర్ర 1,393 గాను 349, కంది 79,761 హెక్టార్లకు గాను 15,818, పెసర 1,276 గాను 74 హెక్టారుల్లో, మినుము 2,475 గాను 175 సాగయ్యాయి. వేరుశనగ 519 హెక్టర్లకు గాను 326 హెక్టార్లలో, నువ్వులు 2969 హెక్టార్లకు గానూ 826 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 161లకు గాను 11 హెక్టార్లలో, ఆముదం 1,886లకు గాను 1,047 హెక్టార్లలో సాగయ్యాయి. ఇంకా సోయాబీన్‌తోపాటు పలురకాల నూనె జాతి పంటలు కూడా సాగు చేశారు.

ప్రధాన పంటల సాగు:

పత్తి 33,918 హెక్టార్లకు గాను 14,723, మిరప 20,722 గాను 7,691, పొగాకు 1,703 హెక్టార్లకు గాను 475 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా ఉల్లి, చెరకు, పొగాకు, పసుపు, టమోటా పంటలు కూడా సాగయ్యాయి. ఇవన్నీ ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాలతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కింద 2,84,113 రైతు కుటుంబాలకు రూ. 213.08 కోట్లు అందజేసింది. అలాగే రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలు, యంత్రాలు సైతం అందుబాటులో ఉంచింది.

15 రోజులుగా కురుస్తున్న వానలతో ఖరీఫ్‌కు ఊపిరి జిల్లాలో ఖరీఫ్‌ లక్ష్యం 5,36,442 ఎకరాలు ఇప్పటి వరకు సాగైంది 1,36,600 ఎకరాలు సాగు కానున్న మిర్చి, వరి, పత్తి, కంది పంటలు పలు ప్రాంతాల్లో ఊపందుకున్న పంటల సాగు

త్రిపురాంతకం మండలంలో సాగవుతున్న వరి1
1/4

త్రిపురాంతకం మండలంలో సాగవుతున్న వరి

మార్కాపురం మండలంలో సాగవుతున్న జొన్న2
2/4

మార్కాపురం మండలంలో సాగవుతున్న జొన్న

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement