
ఎంఈఓలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
మార్కాపురం: ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 23న మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి పోటీలు పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి సూచించారు. సోమవారం తన నివాసంలో ఎంఈఓలు, హెచ్‌ఎంలతో పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రతి నెలా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఫోక్‌డ్యాన్స్, క్విజ్, వ్యాసరచన విభాగాల్లో పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ, భోజన వసతి, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలపై కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కాపురం, తర్లుపాడు ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు అచ్యుత సుబ్బారావు, సుబ్రహ్యణ్యం, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్, సత్యనారాయణ, మండ్లా రామాంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.