
ఒంగోలు కొణిజేడు బస్టాండ్ సెంటర్‌లో కొలువుదీరిన దశావతార లంబోదరుడు
ఊరూవాడా వేడుకగా గణేశ్ చతుర్థి సంబరాలు
వినాయక చవితి సంబరాలు సోమవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోసం జిల్లాలో వాడవాడలా లంబోదరుడి మండపాలను సుందరంగా ముస్తాబు చేశారు. మిరుమిట్లు గొలిపే మండపాల్లో ఠీవీగా ఆసీనుడైన గణనాథుడిని శరణు కోరుతూ భక్తులు విశేష పూజలు చేశారు. విఘ్నాలు తొలగించి.. విజయం సిద్ధింపజేయాలని, విజ్ఞానాన్ని ప్రసాదించాలని గణాధిపుడిని మనసారా వేడుకున్నారు. కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, సరదా క్రీడలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. రెండో రోజు మంగళవారం గణేశ్ నిమజ్జనాలు కోలాహలంగా సాగాయి. – సాక్షి నెట్‌వర్క్

కంభం పట్టణంలో నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు

కంభం చెరువులో గణేశ్ విగ్రహ నిమజ్జనం

రంగుతోటలో కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో కలశాల విగ్రహం

పామూరులో పంచముఖ గణపతికి భక్తుల పూజలు

దర్శిలోని పుచ్చలమిట్టలో మట్టి గణపతికి పూజలు

ఒంగోలు మున్సిపల్ ఆఫీస్ ఎదుట భారీ గణేశుడు

పుల్లలచెరువులోని గాంధీ కళాక్షేత్రంలో..

ఒంగోలు రాజపానగల్ రోడ్డులో బాలగణపతి