ఒంగోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్ అండర్ 14, అండర్ 17 బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 23న తాళ్లూరు మండలం తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.వనజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికకు పూర్వ ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని విద్యార్థినీ విద్యార్థులు అర్హులు. ఎంపికలో పాల్గొనేవారు తప్పకుండా అకడమిక్ మానిటరింగ్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుని ఉండాలని, అండర్ 17 కేటగిరీలో పాల్గొనే విద్యార్థులు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అయి ఉండాలన్నారు. వారు తప్పనిసరిగా పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, జ్ఞానభూమి చైల్డ్ ఐడీ నంబర్, సంబంధిత ప్రిన్సిపాల్ ధ్రువీకరణతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9666702555 నంబర్ ను సంప్రదించాలన్నారు.