ఖోఖో పోటీల్లో ప్రకాశం బాలుర జట్టుకు ద్వితీయ స్థానం

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు
అండర్–19 విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు
జె.పంగులూరు: రాష్ట్ర స్థాయి అండర్–19 బాలుర ఖోఖో పోటీలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో విజయనగరంలో జరిగాయి. పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్లలో 12 మంది బాలురు ఉమ్మడి ప్రకాశం జిల్లా జె.పంగులూరు మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు కావటం విశేషం. ఈ సందర్భంగా బాలుర జట్టును ఇంటర్మీడియెట్ బోర్డ్ ఆర్‌ఐఓ సైమన్, స్కూల్ గేమ్ అండర్–19 సెక్రటరీ ఆదినారాయణ, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచు గరటయ్య, శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, మాగుంట కళాశాల చైర్మన్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కోచ్ పీడీ మేకల సీతారామిరెడ్డి క్రీడాకారులను బుధవారం అభినందించారు. ఒకే కళాశాల నుంచి 12 మంది క్రీడాకారులు ఎంపికవడం గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ సాదిన రమేష్ అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనపరిచిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు జూన్ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీల్లో పాల్గొంటారని మేకల సీతారామిరెడ్డి తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న
క్రీడాకారులు
కంచెర్ల వెంకట్రావు, పొన్నగంటి గోపి, జనమాల విజయ్‌కుమార్ వీరి ముగ్గురుని స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.