
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అలాగే, దాడులకు నైతిక బాధత్య వహించి హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. బయటకు వస్తే, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి నెలకొంది. దీనికి బాధ్యత హోం మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2024