విశాఖపట్నం: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్‌లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడ్డారు.
ఈరోజు( సోమవారం, మార్చి 23వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. వైఎస్ జగన్‌ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్‌పై అభాండాలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత సహనంగా ఉన్నా అబాండాలు వేస్తూనే ఉన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. ప్రెస్‌మీట్లు పెట్టి అసత్యాలు చెబుతున్నారు. సొంత అన్నను దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ చేతులు కలుపుతారా?,ఇంత ప్రేమగా చెల్లెళ్లను చూసుకొనే అన్న ఎవరైనా ఉన్నారా?, మీపై ప్రేమతో జగన్ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? , బాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌ను ద్వేషించే చంద్రబాబుతో మీరు స్నేహం చేస్తున్నారు.చంద్రబాబు డైరక్షన్‌లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా?, మీకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా?, తెలంగాణ పార్టీ పెట్టి కడదాకా అక్కడే ఉంటా అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను విడిచిపెట్టేది లేదన్నారు. కానీ అక్కడ పార్టీ మూసేసి ఇక్కడకు వచ్చారు’ అని మండిపడ్డారు వరుదు కళ్యాణి.
జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి..
వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడిగితే చెబుతారని వరుదు కళ్యాణి సవాల్ చేశారు. ‘ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. మీ తప్పుడు ఆరోపణలకు మేం సమాధానం చెబుతున్నాంఆయన సహనాన్ని మీరు బలహీనతగా తీసుకుంటున్నారు.
వైఎస్ జగన్ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. వైఎస్ జగన్ చెల్లెలు కదా అని సహనంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. ఎవరి డైరక్షన్‌లో మీరు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరక్షన్‌లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. అవినాష్‌రెడ్డి, రాచమల్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలేవి?, వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత మీకు లేదా?, వైఎస్ జగన్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నిలదీశారు.


