‘చంద్రబాబుది క్రెడిట్‌ చోరీ’ | YSRCP Leader Margani Bharat Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుది క్రెడిట్‌ చోరీ’

Sep 1 2026 6:28 PM | Updated on Sep 1 2026 6:40 PM

YSRCP Leader Margani Bharat Slams Chandrababu Naidu

రాజమండ్రి(తూ.గో. జిల్లా): చంద్రబాబు పూర్తి చేసిన కాలువ పనులు కూడా అవినీతిమయమేనని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్‌ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులు వైఎస్సార్‌ రెక్కల కష్టమన్నారు. చంద్రబాబుది క్రెడిట్‌ చోరీ తప్ప ఏమీలేదని ధ్వజమెత్తారు.

పోలవరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఎడమ కాలువ ద్వారా తరలించడం లేదని, పురుషోత్తపట్నం నుండి ఏలేరులో నీటిని ఎత్తిపోసి ఎడమ కాలువ ద్వారా పంపుతున్నారన్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు నీరు కాదని.... గ్రావిటీపై ఒక చుక్క కూడా నీరు రావటం లేదన్నారు.

‘పోలవరం ఎడమ కాలువ నుండి నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. వైఎస్సార్ హయాంలోనే రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్  చాలావరకు పూర్తయ్యాయి.   ఇది జల యజ్ఞం కాదు... ధన యజ్ఞం.. అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. 45.72 మీటర్లు నీటిని నిల్వ చేస్తే తప్ప గ్రావిటీపై ఉత్తరాంధ్రకు నీటి సరఫరా సాధ్యం కాదు. 

పోలవరం ప్రాజెక్టును 41.15  మీటర్లకు పరిమితం చేస్తే ఇది కేవలం బ్యారేజ్ గా మిగులుతుంది. కుడి, ఎడమ కాలువలు తవ్వించకపోతే అసలు పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా?, ఇప్పుడు ఉన్నదంతా జంజీ జనరేషనే... గతంలో చంద్రబాబు పవిత్ర సంగమం పేరిట డ్రామా చేశారు. మీరు చేసే పనులు వల్ల విద్యుత్ ఎంత అవుతుంది. చంద్రబాబు దారుణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని విమర్శించారు.

చంద్రబాబు మొగల్తూరు పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement