కాకినాడ: చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు.. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తురన్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వారి సొంత ఎజెండా తప్పా మరొకటి లేదని మండిపడ్డారు.
‘ప్రజాస్వామ్య వ్యవస్థలకు,ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఈ రాష్ట్రంలో లేదు. అభిప్రాయాలు చెబితే వారి మీద కేసులు పెడుతున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియాను వారి ఆధీనంలో పెట్టుకుంది. సోషల్ మీడియా ను కంట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయ్యడానికి ఒక గ్రూప్ పని చేస్తోంది.
ఇప్పుడు సోషల్ మీడియా ను ప్రభావితం చెయ్యడానికి పోలీసులతో ఒక అడుగు ముందు వెయ్యడానికి ప్రభుత్వం పని చేస్తోంది. ఆయా ఖాతాలను సస్పెండ్ చెయ్యడానికి పోలీసులు పని చేస్తున్నారు. అధికార పార్టీ కి పోలీసులు పూర్తిగా సరెండర్ అయిపోయారు. భాధితులను కాపాడాల్సిన పోలీసులు. .వారిని హింసిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చెయిస్తున్నారు. మాజీ సిఎం జగన్ పిఆర్వో శ్రీహరి పై రెండు కేసులు పెట్టి..హైకోర్టు లో బెయిల్ రాకుండా ప్రయత్నించారు. వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను విచారణ నిమిత్తం పిలిచారు. టీడీపీ హ్యాండిల్ నుండి వైఎస్సార్‌సీపీ బృందంపై బురద చల్లుతారు. ఆర్టికల్ 19 1a క్రింద ప్రశ్నించే హక్కు ఉంది.
అమరావతి లో అవినీతిని ప్రశ్నించారని ఎక్స్ ట్వీటర్‌కు ఫిర్యాదు చేసి ఆ వీడియోను తీయించేశారు. శ్రీకాళహస్తి లో సౌకర్యాలు లేవని ఒక మహిళ మాట్లాడిన వీడియోను జగనన్న కనెక్ట్స్ నుండి తీయించమని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమరావతి లో అవినీతిని ప్రజలు ఎత్తి చూపితే సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో అద్దాలు..అబద్దాలే కధ జరుగుతున్నాయి. అమరావతి లో భవనాలకు అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు.

కేంద్ర గ్రాంట్ కోసం ఒక విభాగాన్ని ఎందుకు పెట్టలేదు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ను ఎందుకు వాడుకోవడం లేదు.మేము వీటి కోసం అడిగితే...మీరు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ్టీకీ ఆరోగ్యశ్రీ లో వైద్యం అందడం లేదు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో మందులు లేవు. ఈ రోజుకు పండిన ధాన్యం కొనలేని పరిస్థితి లో ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ప్రజా గ్రహం ఉవ్వెత్తున లేస్తూవుంటే...దానిని అగణతొక్కుతున్నారు.
ఎంతకాలం గ్లోబెల్స్ ప్రచారంలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధిన ఒక్కోక్క వాస్తవం బయటపడుతుంది. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరికి సహయం చెయ్యడం లేదు’ అని మండిపడ్డారు.


