దసరాకైనా ఉద్యోగుల జీతాలు ఇస్తారో లేదో? | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయ్‌

Published Fri, Sep 30 2022 7:43 AM

YS Sharmila Satires On TRS Government Employees Salary - Sakshi

హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతం ఇవ్వడం లేదని, దసరాకైనా జీతాలిస్తారో.. లేదో? అని ఆందో ళన చెందుతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆమె ధ్వజమెత్తారు.

గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్, నస్తిపూర్, దౌల్తాబాద్, కాసాలా దేవులపల్లి, హత్నూర, కొన్యాల వరకు నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్‌ అందించిన ఘనత అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సుపరిపాలనను తిరిగి అందించేందుకే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. వైఎస్సార్‌ టీపీని ఆదరిస్తే రూ.3,000 పింఛన్, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు.
చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ నిర్వాకం

Advertisement
 
Advertisement
 
Advertisement