మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం..! | Women Commission Chief Seen With Accused Astrologer Sparks Maharashtra Political Row | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం..!

Mar 20 2026 5:16 PM | Updated on Mar 20 2026 6:27 PM

Women Commission Chief Seen With Accused Astrologer Sparks Maharashtra Political Row

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్‌ మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్‌ ఖారత్‌తో  ఆ రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్‌  రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది.  

మహిళా చైర్‌పర్సన్స్‌ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది.  చైర్‌పర్సన్‌ పదవికి చకాంకర్‌ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రుపాలి చకాంకర్..  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో  ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు.  మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్‌ షిండే), అజిత్‌ పవార్‌ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. 

ఇదిలా ఉంచితే, ఆ రిటైర్డ్‌ మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌ అశోక్‌ ఖారత్‌.. ఓ మహిళను ఆస్ట్రాలజీ పేరుతో మోసం అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె బెదిరించి, భయపెట్టి గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పెన్‌డ్రైవ్‌లో 58 వీడియోలు, అందులో కొన్ని అభ్యంతరకరమైన క్లిప్స్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా అతనిపై కేసులు పెట్టారు.

అయితే ఇప్పుడు మహిళా చైర్‌పర్సన్‌ రూపాలి ..  ‘కెప్టెన్‌’ అని చెప్పుకునే సదరు ఆస్ట్రాలజర్‌ అశోక్‌తో దిగిన ఫోటోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  

Advertisement
 
Advertisement
Advertisement