
ఈటల చెప్పిన మాటలకు, చేసే పనులకు పొంతన లేదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ఈటల ఎక్కింది మునిగిపోయే నావా అంటూ ఎద్దేవా చేశారు. ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈటల చెప్పిన మాటలకు, చేసే పనులకు పొంతన లేదు.. ఆయన బీజేపీలో చేరి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు అంటూ జగదీష్ రెడ్డి మండి పడ్డారు. కేంద్రం తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
భూఆక్రమణల ఆరోపణలు నేపథ్యంలో ఈటల రాజేందర్.. కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటలను ఇటీవల టీఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అనంతరం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఈటల సోమవారం బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం అయింది.