
ఆదిలాబాద్ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇచ్చే పరిస్థితులో లేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో.. లేదో అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఒకవేళ తాను గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేనన్నారు. బోథన్‌ను రెవెన్యూ డివిజన్ చేయమని వచ్చిన స్థానికుల వద్ద మంత్రి స్థానంలో ఉన్న జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను ఎటువంటి హామీని ప్రజలకు ఇవ్వలేనని, వచ్చే ఎన్నికల్లో తాను గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో.. రాదో అని అన్నారు. తాను కూడా గెలుస్తానో.. లేదో అనే విషయం కచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో నియోజకవర్గానికి ఎటువంటి హామీ ఇవ్వలేనన్నారు మంత్రి జూపల్లి.