విజయవాడ: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్‌

TDP Women Activists Overaction In Rani Gari Thota Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఓవరాక్షన్‌ చేశారు. దేవినేని అవినాష్‌  పర్యటనలో మహిళా కార్యకర్తలు గలాటా సృష్టించారు.

వాలంటీర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రిటైనింగ్‌ వాల్‌ పూర్తి చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కడంతో  టీడీపీ గొడవకు దిగింది. చిల్లర, నీచ రాజకీయాలకు టీడీపీ మహిళా కార్యకర్తలు తెరలేపారు.

వారికి ఓటమి భయం పట్టుకుంది: దేవినేని అవినాష్‌
చంద్రబాబు, గద్దె రామ్మోహన్‌కు ఓటమి భయం పట్టుకుందని దేవినేని అవినాష్‌ మండిపడ్డారు. ‘‘తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేకపోతున్నారు. గత ఐదేళ్లు రిటైనింగ్ వాల్ కట్టకుండా టీడీపీ టైమ్ పాస్ చేసింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం. రాణీగారితోట వాసులకు ముంపు కష్టాలు లేకుండా చేశాం. టీడీపీ కార్యకర్తల ఇళ్లలోనూ పథకాలిచ్చాం. చంద్రబాబు హయాంలో కూడా తమకు ఇంత సంక్షేమం అందలేదని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని గద్దె రామ్మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని అవినాష్‌ దుయ్యబట్టారు.
చదవండి: పొత్తు పొడిస్తే.. సీటు సితారే..

‘‘పైకి మహాత్మాగాంధీకి వారసుడినని గద్దె బిల్డప్ ఇస్తాడు. తెర వెనుక గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను తయారు చేస్తాడు. మహిళలకు డబ్బులిచ్చి మాపై ఉసిగొల్పుతున్నారు. ఇప్పటికైనా గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు తమ బుద్ధి మార్చుకోవాలి. నీచ రాజకీయాలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతాం’’ అని అవినాష్‌ హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top