ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే, నేత మధ్య రాళ్లదాడులు | TDP Faction Clash in Proddatur: MLA and Ex Leader Supporters Pelt Stones | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే, నేత మధ్య రాళ్లదాడులు

May 26 2026 5:58 PM | Updated on May 26 2026 6:35 PM

TDP Faction Clash in Proddatur: MLA and Ex Leader Supporters Pelt Stones

వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎస్ మాల్ అంశం టీడీపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌లో వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఈ మాల్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రవీణ్‌ రెడ్డి కలెక్టర్‌, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రవీణ్‌ రెడ్డి ఫిర్యాదుతో ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు వెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రవీణ్‌ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై రాళ్లదాడి చేశారు.ప్రతిగా ఎమ్మెల్యే వర్గీయులు కూడా రాళ్లు విసిరారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement