అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా.. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు! | TDP Chandrababu Over Action At East Godavari Anaparthi | Sakshi
Sakshi News home page

అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా.. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు!

Feb 17 2023 7:30 PM | Updated on Feb 17 2023 7:54 PM

TDP Chandrababu Over Action At East Godavari Anaparthi - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైనే సభ పెట్టెందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. ఎంత చెప్పినా తన అనుచరులతో బాబు వీరంగం సృష్టించారు. 

ఇక, చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బారికేడ్డు తొలగించి పోలీసులపై టీడీపీ కార్యకర్తలు జులం చూపించారు. దీంతో, స్థానికులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓవరాక్షన్‌పై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. పోలీసు ఆజ్ఞలను చంద్రబాబు ధిక్కరిస్తున్నారు. అనపర్తిలో నడిరోడ్డుపై సభ వద్దని చెప్పినా వినడం లేదు. నిబంధనలు పాటించాలి అన్నందుకు బాబు పేట్రేగిపోయారు. 

దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. జీవో-1 అమలులో ఉందని హైకోర్టు చెప్పినా.. బాబు పట్టించుకోవడం లేదు. తనకు ప్రత్యేక రాజ్యాంగం ఉందని అనుకుంటున్నారు. నడిరోడ్డుపై సభ వద్దన్నందుకు డ్రామా మొదలుపెట్టారు. 

కన్నబాబు మాట్లాడుతూ.. జెడ్‌ప్లస్‌ కమాండోల రక్షణ ఉందని చంద్రబాబు బరితెగిస్తున్నారు. 11 మందిని బలి తీసుకున్నాక కూడా అదే పంథాలో వెళ్తున్నారు. చట్టం కన్నా తాను ఎక్కవని చంద్రబాబు అనుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement