ఎమ్మెల్యే పులవర్తికి ‘చెప్పు’ చూపించిన మరో కూటమి నేత | TDP And Janasena Rift Peaks in Chandragiri Constituency | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పులవర్తికి ‘చెప్పు’ చూపించిన మరో కూటమి నేత

May 24 2026 10:18 PM | Updated on May 24 2026 10:21 PM

TDP And Janasena Rift Peaks in Chandragiri Constituency

తిరుపతి:  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతలు మధ్య  విభేదాలు తారస్థాయికి చేరాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి జనసేన పార్టీ నేత మురళి రెడ్డి చెప్పు చూపిస్తూ వార్నింగ్‌ ఇవ్వడంతో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 

చంద్రగిరి మండలం  తొండవాడ  గ్రామానికి వచ్చారు ఎమ్మెల్యే పులవర్తి నాని. ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇందుమూలిరెడ్డిని కలిసేందుకు వచ్చిన తొండవాడ గ్రామానికి వచ్చారు పులవర్తి నాని. అయితే అంతకుముందు తొండవాడ గ్రామాన్ని శత్రుదేశం పాకిస్థాన్ తో పోల్చడం పై ఎమ్మెల్యే ముందుగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  జనసేన నేత మురళి రెడ్డి చెప్పు చూపించారు.  

తమ ఊరిని పాక్‌తో పోలుస్తావా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. గడచిన ఎన్నికల్లో 566 ఓట్లు మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్ తో ఎలా పోల్చుతావు అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే కాలుకున్న చెప్పు తీసి..  సమాధానం చెప్పు అంటూ హెచ్చరించారు. అయితే జనసేన నేత మురళీరెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement