రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి | Socialist, Secular Words Missing In Constitution's New Copies: Adhir Chowdhury | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి

Sep 20 2023 11:13 AM | Updated on Sep 20 2023 11:25 AM

Socialist Secular Words Missing In Constitution Copies Adhir Chowdhury - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 

మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు.

నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు  అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. 

అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక

ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement