స్మృతి ఇరానీ నామినేషన్‌.. అమోథీ బరిలో రాహుల్‌, ప్రియాంక | Smriti Irani files nomination from Amethi seat | Sakshi
Sakshi News home page

స్మృతి ఇరానీ నామినేషన్‌.. అమోథీ బరిలో రాహుల్‌, ప్రియాంక

Apr 29 2024 2:45 PM | Updated on Apr 29 2024 2:45 PM

Smriti Irani files nomination from Amethi seat

ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన అమేథీ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..అమోథీ ఎంపీగా బాధత్యలు నిర్వహించిన ఐదేళ్ల కాలంలో తాను పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద సుమారు 1,14,000 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. 1.5లక్షల కుటుంబాలకు ఎలక్ట్రసిటీ కనెక్షన్లు, 4 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఈ సారి ఎన్నికల్లోనూ తాను విజయం సాధిస్తామని స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ​

అయోమయంలో కాంగ్రెస్‌ 
అయితే కాంగ్రెస్‌ కంచుకోట అమోథీలో మరోసారి విజయ బావుటా ఎగురవేయాలని అధికార పార్టీ బీజేపీ భావిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మాత్రం ఆ స్థానంలో స్మృతి ఇరానీకి ధీటైన అభ్యర్ధిని నిలబెట్టేందుకు మల్లగుల్లాలు పడుతోంది.

అమోథీ బరిలో రాహుల్‌, ప్రియాంక
ఇప్పటికే పలు మార్లు అమోథీలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపికపై తీవ్ర కసరత్తు జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్ధులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ,రాబర్ట్‌ వాద్రాలేనంటూ ప్రచారం  జరుగుతోంది.. కానీ ఓ కొలిక్కి రాలేదు. ఈ తరుణంలో ఏప్రిల్‌ 26 తర్వాత కాంగ్రెస్‌ కమిటీ భేటీలో అమోథీ, రాయబరేలీ స్థానాల్లో అభ్యర్ధుల ఖరారు చేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో అయా స్థానాల అభ్యర్ధులు ఎవరనేది క్లారిటీ ఇవ్వనుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement