‘శీష్‌మహల్‌ టు తీహార్‌’.. కేజ్రీవాల్‌పై బీజేపీ సెటైర్లు | Sheesh Mahal to Tihar BJP Poster Jibe At Kejriwal | Sakshi
Sakshi News home page

‘శీష్‌మహల్‌ టు తీహార్‌’.. కేజ్రీవాల్‌పై బీజేపీ సెటైర్లు

Apr 1 2024 8:09 PM | Updated on Apr 1 2024 9:11 PM

Sheesh Mahal to Tihar BJP Poster Jibe At Kejriwal - Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ సోషల్‌ మీడియాలో సెటైర్లు  మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసం శీష్‌మహల్‌ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది.

‘గిల్టీ ఆఫ్‌ లిక్కర్‌ స్కామ్‌.. శీష్‌ మహల్‌ టు తీహార్‌’ అనే క్యాప్షన్‌ను పోస్టుకు జత చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్‌మహల్‌ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్‌ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్‌ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత  కోర్టు సోమవారం( ఏప్రిల్‌ 1) జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.  

ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement