రెండో రోజు రాహుల్‌ పర్యటన.. మూడు సభలు.. పలువురు కాంగ్రెస్‌లోకి చేరిక

Rahul Gandhi Telangana Tour Meeting At Shadnagar kalwakurthy Jadcherla - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం వరకు నొవాటెల్‌ హోటల్‌లోనే ఉండనున్న రాహుల్‌.. పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెండింగ్‌ సీట్లపై పీసీసీ నేతలతో సమావేశం కానున్నారు. రాహుల్‌ భేటీతో వామపక్ష సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాహుల్‌ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌లోకి గడ్డం వివేక్‌?
కాసేపట్లో నోవోటెల్ హోటల్‌కు మాజీ ఎంపీ వివేక్ వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది.  రాహుల్తో వివేక్‌ భేటీ అవుతారని, కొడుకు వంశీతో సహా కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో చేరికను ఖండించిన బీజేపీ నేత గడ్డం వివేక్‌వెంకటస్వామి.. పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫునే పోటీ చేస్తానని ప్రకటించారు.

చదవండి: ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top