
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రాజెక్ట్‌లను ఆ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు శనివారం ప్రధాని పునాది రాయి వేశారు. మోదీ మాటల శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూపీలో జరిగిన ఈ కార్యక్రమంలో కూడా తన మార్క్ మాటలను కనబరిచారు ప్రధాని మోది. ఈ సారి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, విపక్షాలపై తనదైన మాటలతో విరుచుకుపడ్డారు.
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాఫియా అక్రమ నిర్మాణాలను ఓ బుల్‌డోజర్ కూల్చివేస్తోంది. కాకపోతే ఆ మాఫియాను నమ్ముకున్న వాళ్లకు ఇది బాధకలిగిస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఈ పని తీరుతో సంతోషంగా ఉన్నారు. అందుకే ప్రజలు యూపీ+యోగి...ఉపయోగి ( ఎంతో ఉపయోగకరం) అంటున్నారు’ అని యోగి పాలనను చమత్కరిచి అందరినీ ఆకట్టుకున్నారు. జరిగిన ఐటీ దాడులను ఉద్దేశించి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మాజీ ముఖ్యమంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ప్రజా సొమ్మును అభివృద్ధి, పథకాల పేరుతో ఎలా ఉపయోగించారో మనందరికి తెలిసిన విషయమే. అవన్నీ కేవలం కాగితల్లో మాత్రం కనపడేవి. వాటివల్ల కొందరి జేబులు మాత్రం నిండాయి. ఇప్పుడు ప్రజల సొమ్ము అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల తీరును ఈ కార్యక్రమంలో ప్రధాని ఎండగట్టారు.
చదవండి: Viral Video: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ