వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగానే చూస్తాం | Pawan Kalyan Comments On CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగానే చూస్తాం

Jan 24 2021 5:05 AM | Updated on Jan 24 2021 5:05 AM

Pawan Kalyan Comments On CM YS Jagan Mohan Reddy - Sakshi

ఒంగోలు అర్బన్‌: తాము వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్రిస్టియన్‌గా చూడమని ఒక ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగానే చూస్తామని, కొంతమంది నాయకులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి క్రిస్టియన్‌ ముఖ్యమంత్రి అంటూ విమర్శించడం సరికాదని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కులమతాలకతీతంగా రాజకీయాలు ఉండాలని జనసేన భావిస్తోందన్నారు.

సీఎం పలానా మతం, ఇంకొకరు మరొక మతం అంటూ మతాల గురించి తాను మాట్లాడనన్నారు. ఇటీవల జనసేన కార్యకర్త మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. తొలుత గిద్దలూరులో మరణించిన వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.8.50 లక్షలు అందచేశారు. అనంతరం జిల్లా ఎస్పీని కలిసి వెంగయ్య మరణంపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement