
సాక్షి, నెల్లూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జూమ్ పార్టీ అధ్యక్షుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. ప్రస్తుతం పోలవరం, వెలుగొండ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
‘ఆపత్కాలంలో సలహాలు ఇవ్వడం మానేసి హైదరాబాద్‌లో కూర్చున్నారు. స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని’ మంత్రి ధ్వజమెత్తారు. పక్కరాష్ట్రంలో ఉంటూ తండ్రీకొడుకులు చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ఈ రెండేళ్లలో ఏనాడైనా ప్రజల కోసం బాబు ఏపీకి వచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. ఎల్లో ఫంగస్ కంటే ఎల్లోమీడియా ప్రమాదకరమని తెలిపారు. అనంతరం ఆయుర్వేద మందుపై నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
చదవండి: 2 years YSJagan ane nenu: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు