‘చంద్రబాబు.. కావాలనే జనాన్ని రెచ్చగొట్టారు’ | MLC Arun Kumar Serious Comments On TDP Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. కావాలనే జనాన్ని రెచ్చగొట్టారు: ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌

Apr 22 2023 2:48 PM | Updated on Apr 22 2023 3:46 PM

MLC Arun Kumar Serious Comments On TDP Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. దళిత జాతికి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దళితులను హింసించిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యర్రగొండపాలెంలో కావాలనే చంద్రబాబు జనాన్ని రెచ్చగొట్టారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము శాంతియుతంగా ఆందోళన చేస్తే మాపై దాడి చేయించారు. దళిత జాతిని చంద్రబాబు మోసం చేశారు. కానీ, దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి భారీగా సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. దీంతో, చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలకు తెరతీశారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల గురించి నాలుక కోస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. సీఎం జగన్‌ దెబ్బకు చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్రంలో చెరోచోటా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్రలు, రాళ్లతో దాడి చేసింది టీడీపీ నేతలే. ప్రజలందరూ చూస్తుండగానే టీడీపీ నేతలు దాడులు చేశారు. చంద్రబాబు.. దళితులకు క్షమాపణ చెప్పి ఎక్కడైనా తిరగొచ్చు. సురేష్‌ బాబు శాంతియుతంగా నిరసన చేస్తే రాళ్ల దాడి చేస్తారా?. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement