మాతృమూర్తి సేవ కోసం వెళితే విమర్శలా?

MLA Rachamallu Shiva Prasad Reddy Clarity on Hes Health Condition - Sakshi

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : కరోనా కమ్ముకున్న వేళ నా కుటుంబంపై కనికరం లేని కథనాలేలని, మాతృమూర్తి సేవ కోసం వెళ్లిన తనపై విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం తన జన్మహక్కు అని, దాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఎన్టీవీలో వచ్చిన కథనాలకు దీటుగా ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. తన మాతృమూర్తి రాచమల్లు మునిరత్నమ్మతోపాటు హైదరాబాదు కూకట్‌పల్లి హోలిస్టిక్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆదివారం ఫోన్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా దాన్ని అదుపులో ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ కరోనా ఆవహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మా నుంచి ఎవరికీ వ్యాధి సోకకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.ఎన్‌టీవీలో కక్షపూరిత, దురుద్దేశంతో కూడిన   కథనం ప్రచారం చేశారని తెలిపారు. ‘ఒక్కసారిగా సైలంట్‌ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే’అని విషప్రచారం చేసిందన్నారు.

ఈనెల 12న వైఎస్సార్‌ చేయూత కార్యక్రమానికి హాజరు కాబోయే ముందు రోజే తాను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యే హోదాలో కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఈనెల 14న మా తల్లి రాచమల్లు మునిరత్నమ్మకు పాజిటివ్‌ రావడంతో ఆమె చికిత్స కోసం హైదరాబాద్‌కు బయల్దేరాను.అంతకుముందే తాను మరో సారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నానన్నారు. ప్రొద్దుటూరు–హైదరాబాద్‌ మార్గమధ్యలో ఉండగా తనకు కరోనా పాజిటివ్‌ అని తెలిసిందన్నారు. తాను, తన తల్లి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరామన్నారు.  

ఎన్టీవీ తనపై కక్షకట్టి ఉద్దేశపూర్వకంగానే ఎక్కడో ఆరుబయట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. మానవత్వం  ఉన్న తన నియోజకవర్గ ప్రజలు, ఆఖరికి ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఎన్టీవీ వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మారి, జర్నలిజం విలువలు మరిచిపోయి అసత్యప్రచారం చేస్తోందన్నారు. గౌరప్రదంగా, నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలను అందించడం,జెండా వందనం చేయడం తన విధి అన్నారు. దీనిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదన్నారు.  కరోనా వ్యాధిగ్రస్తుల మధ్య స్వాతంత్య్ర వేడుకులను నిర్వహించడం తప్పు ఎలా అవుతుందో ఎన్టీవీనే చెప్పాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-10-2020
Oct 30, 2020, 15:24 IST
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభణతో ఓ పక్క దేశంలోని కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా ప్రభుత్వాస్పత్రులన్నీ కిక్కిరిసి పోతుండగా, ఉన్నంతలో వారికి...
30-10-2020
Oct 30, 2020, 14:56 IST
జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. దీనిని అరికట్టే వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచ...
30-10-2020
Oct 30, 2020, 10:27 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్‌ కేసులు...
30-10-2020
Oct 30, 2020, 10:00 IST
న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో  48,648 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  80,88,851కి చేరింది. నిన్న...
30-10-2020
Oct 30, 2020, 09:14 IST
సాక్షి,హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్ భారతదేశంలో కోవిడ్-19 తేలికపాటి లక్షణాలకు వినియోగించే మందులను లాంచ్ చేసింది. తాజాగా...
30-10-2020
Oct 30, 2020, 08:01 IST
సాక్షి, ముంబై: బంగారం డిమాండ్‌ జూలై-సెప్టెంబర్‌ మధ్య ఇటు భారత్‌లో అటు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయింది. కరోనా మహమ్మారి దీనికి ప్రధాన...
29-10-2020
Oct 29, 2020, 19:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజంభణను అరికట్టేందకు యూరప్‌లో అమలు చేస్తోన్న రెండో విడత లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజలు...
29-10-2020
Oct 29, 2020, 18:00 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 88,778 మందికి పరీక్షలు నిర్వహించగా.....
29-10-2020
Oct 29, 2020, 16:11 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇంగ్లండ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి రెండో దశ విజంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు లక్ష కేసులు...
29-10-2020
Oct 29, 2020, 15:44 IST
సాక్షి, ఢిల్లీ :  దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా తీవ్ర‌త మళ్లీ పెరుగుతుంది. దీంతో ఢిల్లీలో క‌రోనా మూడ‌వ ద‌శ‌కు...
29-10-2020
Oct 29, 2020, 14:18 IST
సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్‌ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు...
29-10-2020
Oct 29, 2020, 14:14 IST
ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారు ప్రాణాలతో బయట పడాలంటే వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ‘యాంటీ బాడీస్‌ (రోగ...
29-10-2020
Oct 29, 2020, 11:57 IST
సాక్షి,న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారి రెండవసారి విజృంభణతో ఆందోళన చెందుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పౌరులకు ఊరటనందించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే  ప్రజలందరికీ...
29-10-2020
Oct 29, 2020, 09:49 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
29-10-2020
Oct 29, 2020, 08:45 IST
ఒకవేళ ఇప్పటికైనా మనం జాగ్రత్తపడకపోతే సమీప కాలంలో 4 లక్షలకు పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది.
29-10-2020
Oct 29, 2020, 08:13 IST
ట్యూరిన్‌ (ఇటలీ): మేటి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను కరోనా వదలడం లేదు. అతనికి మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్‌–19...
29-10-2020
Oct 29, 2020, 02:17 IST
సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్, వ్యాక్సిన్‌.. కోవిడ్‌ను అంతం చేసే టీకా కోసం ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. సెపె్టంబర్, అక్టోబర్‌...
28-10-2020
Oct 28, 2020, 19:48 IST
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు...
28-10-2020
Oct 28, 2020, 19:44 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు బుధవారం నాటికి 80 లక్షల మార్క్‌కు చేరువ కాగా, మహమ్మారి...
28-10-2020
Oct 28, 2020, 19:16 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 77,028 మందికి పరీక్షలు నిర్వహించగా.....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top