‘లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం వల్లే కందుకూరు ఘటన’ | Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం వల్లే కందుకూరు ఘటన’

Dec 29 2022 11:17 AM | Updated on Dec 29 2022 12:03 PM

Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ఘటన జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్థానికులు రాకపోడంతో చంద్రబాబు తనతో జనాన్ని తీసుకువచ్చారన్నారు. 8 మంది అమాయకుల మరణానికి చంద్రబాబే కారణం. కావాలనే ఇరుకు రోడ్డులో రోడ్‌షో నిర్వహించారని మంత్రి ధ్వజమెత్తారు.

‘‘పేదల ప్రాణాలకు చంద్రబాబు వెల కడుతున్నారు. డ్రోన్‌ షాట్స్‌ కోసం 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. 18 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని.. చంద్రబాబు సభకు జనం వస్తారు?. లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం వల్లే కందుకూరు ఘటన. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచిపనైనా చేశారా?. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబే ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ. బాబుతో ఇదేం కర్మ అని జనం అనుకుంటున్నారు’’ అని  మంత్రి కాకాణి అన్నారు.
చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement