Harish Rao: బీఆర్‌జీఎఫ్‌ నిధులివ్వండి | Minister Harish Rao Says To Nirmala Sitharaman Over BRGF Funds | Sakshi
Sakshi News home page

Harish Rao: బీఆర్‌జీఎఫ్‌ నిధులివ్వండి

Sep 18 2021 8:59 AM | Updated on Sep 18 2021 8:59 AM

Minister Harish Rao Says To Nirmala Sitharaman Over BRGF Funds - Sakshi

మంత్రి హరీశ్‌రావు జీఎస్‌టీ సమావేశంలో పాల్గొనడానికి లక్నో వెళ్లిన హరీశ్‌రావు పత్తిపైనున్న రివర్స్‌ చార్జి మెకానిజాన్ని రద్దు చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌ డిమాండ్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి బీఆర్‌జీఎఫ్‌ నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. జీఎస్‌టీ సమావేశంలో పాల్గొనడానికి లక్నో వెళ్లిన హరీశ్‌.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులు సమావేశం విరామ సమయంలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తిచేశారు.

మంత్రి సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని హామీఇచ్చారు. కాగా, సమావేశంలో కేంద్ర రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శి ఇచ్చిన సవివర ప్రజెంటేషన్‌లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గ్యాప్‌ స్వల్పమేనని పేర్కొన్నారు. పత్తిపైనున్న రివర్స్‌ చార్జి మెకానిజాన్ని రద్దు చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌ డిమాండ్‌ చేశారు. 

చదవండి: AP: ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement