టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తాం

మంత్రి గంగుల కమలాకర్
సాక్షి, కరీంనగర్: గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుచుకుంటామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టి టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌పై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కొల్‌కత్తా తర్వాత హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. మతం పేరు చెప్పి యువతను బీజేపీ రెచ్చగొట్టాలని చూసిందని విమర్శించారు. ఆరేళ్ల పరిపాలనకు గ్రేటర్ ఎన్నికలు నిదర్శనమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. (చదవండి: నోముల ఆడియో దుమారం)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి