
సాక్షి, తాడేపల్లి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ హడావుడి చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబుతో రక్త సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ చాలా గగ్గోలు పెడుతున్నాడన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా చెయ్యని విధంగా రోడ్డు మీద పడుకుని ఏదో అయిపోతుందన్నట్లు హడావుడి చేశారని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.
నాదెండ్ల మనోహర్ అందుకోసమే ఎదురుచూస్తున్నాడు
నాదెండ్ల మనోహర్ టీడీపీ, జనసేన పొత్తు తీర్మానం చదివాడు. ఐదు ఏళ్లుగా నాదెండ్ల మనోహర్.. ఆ తీర్మానం చదవడం కోసమే ఎదురుచూస్తున్నాడు. టీడీపీ, జనసేన ఇప్పుడు కాదు.. ఎప్పుడో కలిసి పోయాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడేవన్నీ తప్పులే. టీడీపీ-జనసేన కలిస్తే ఏమవుద్దీ. రెండు సున్నాలు కలిస్తే ఏమవుద్దో.. అంతే జరుగుద్ది. చంద్రబాబు కంటే కూడా నైతిక విలువలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్.
బీజేపీతో ఉంటూ టీడీపీతో పొత్తు..
ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటూ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. నిజ జీవితంలో కూడా పవన్ ఒకరితో పెళ్లి, మరొకరితో సహజీవనం. పొత్తుతో జనసేన పార్టీ ప్రాణం తీశాడు పవన్. టీడీపీకి ప్రాణం పోయాలని అనుకున్న అది పవన్ వల్ల కాదు. లోకేష్ గతంలో సీఎం జగన్‌కి భయం పరిచయం చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు భయాన్ని లోకేష్‌కి పరిచయం చేశాడు. చంద్రబాబు నన్నేం పీకారు అన్నాడు..దేవుడు జైల్లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు, లోకేష్ కంటే గొప్పోడివా. నీకు ఇవ్వాల్సిన పరిస్థితిలో దేవుడు అన్ని ఇస్తాడు. పవన్ నీ మానసిక పరిస్థితి ఏంటి.. ? ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావ్. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబు తప్పు చేశాడు, చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సిందే’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
చదవండి: సైకిల్ గుర్తుతో జనసేన పోటీ?