ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే : కేటీఆర్‌ | KTR Video Conference With Nizamabad Leaders Over MLC Elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే : కేటీఆర్‌

Oct 6 2020 4:54 PM | Updated on Oct 6 2020 7:00 PM

KTR Video Conference With Nizamabad Leaders Over MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో మాజీ ఎంపీ కవితను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చదవండి: ఎన్నికల వేళ.. కేటీఆర్‌ కీలక నిర్ణయాలు

ఆ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారని తెలిపారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ మరోసారి అండగా నిలుస్తుందని పేర్కొ‍న్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కులాలు మతాల పేరిట చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement