
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న నాయకులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
షాద్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే అక్రమ దందా వ్యవహారాలు బయటపెడతామంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం పాలమూరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చిత్తశుద్ధితో జరగడం లేదన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కాంట్రాక్టర్లను డొనేషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి రాష్ట్రంలో రాహుల్ గాంధీ ట్యాక్స్‌ను విధిస్తున్నారని నిందించారు. బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని, న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.