దోచుకో.. దాచుకో.. పంచుకో ఇదే చంద్రబాబు విధానం: మంత్రి కారుమూరి

Karumuri Nageswara Rao On OBC Mahasabha And Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని విమర్శించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని, ఏం మాట్లాడుతున్నారో అయనకే తెలియడం లేదని దుయ్యబట్టారు. దోచుకో.. దాచుకో.. పంచుకో ఇదే చంద్రబాబు విధానమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకంటే సీఎం జగన్‌ ఎక్కువే చేశారన్నారు. 56 కార్పొరేషన్లు ఇచ్చి బీసీల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. బీసీలంతా జగన్‌ వెంట ఉన్నారన్నారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. సీఎంగా జగన్‌ అధికారంలోకి వచ్చాకే బీసీలకు అనేక పదవులు దక్కాయన్నారు. వైఎస్‌ జగన్‌ బీసీలకు నాలుగు రాజ్యసభ పదవులు ఇస్తే.. టీడీపీ ఒక్క పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
చదవండి: దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి

‘గత ఎన్నికల్లో చంద్రబాబును చీకొట్టినా బుద్ధి రాలేదు. బాబును ప్రజలు నమ్మరు. ఐటీ తానే కనిపెట్టానని, సెల్ ఫోన్లు తానే కనిపెట్టానని చెప్పుకుంటున్నారు. ఈడీ దాడులు చేయగానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లమీద పడ్డారు. నోటి దురదతో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పెద్ద స్కాం చేసి జైలుకి వెళ్లొచ్చాడు. బీసీలకు  రావాల్సిన లబ్దిని రాకుండా చేశారు. బీసీల మీటింగుతో టీడీపీ వారికి భయం పట్టుకుంది. టీడీపీ నేతలకు సిగ్గుండాలి. 

బీసీల్లో ఆత్మగౌరవం పెరిగింది. మాకు పదవులు ఇవ్వడమే కాదు, పూర్తి స్వేచ్చ ఇచ్చారు. బీసీలపై చర్చకు మేము సిద్దం. టీడీపీ నేతలు సిద్దమా? ఎవరేమి చేశారో డిసెంబర్‌ 7న జరగనున్న బీసీ సభలో వెల్లడిస్తాం. బీసీల కోసం చంద్రబాబు ఒక్క సెంటు భూమినైనా కొన్నాడా?. అప్పు చేసిన డబ్బు చంద్రబాబు ఏం చేశాడో లెక్క తేల్చాలి. మేము చేసిన అప్పులన్నిటికీ లెక్కలు ఉంటాయి. జయహో బీసీ అనేది టీడీపీ రిజిస్ట్రేషన్ చేసుకుందా?అది అందరిదీ. ఓటు బ్యాంకుగానే మమ్మల్ని ఇంతకాలం వాడుకున్నారు.  ఇకముందు అవేమీ చెల్లవు. వారి ఆట ముగిసింది. టీడీపీకి ఘోరీ కట్టబోతున్నాం. ’ అని మంత్రి కారుమూరి నిప్పులు చెరిగారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top