Jupudi Prabhakar Slams Chandrababu And TDP At Tadepalli - Sakshi
Sakshi News home page

మనిషి రూపంలో ఉన్న సైతాన్‌ చంద్రబాబు: జూపూడి ప్రభాకర్‌

Apr 22 2023 1:59 PM | Updated on Apr 22 2023 2:53 PM

Jupudi Prabhakar Slams Chandrababu And TDP At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీని దళితులు నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్‌ అన్నారు. దళిత నియోజకవర్గాల్లోనూ టీడీపీ దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. దళితులు ఏం పీకారంటూ లోకేష్‌ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరితే రాళ్లదాడి చేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీలో ఎక్కిడికి వెళ్లినా తమ నిరసన ఉంటుందని స్పష్టం చేశారు.

‘పేదలు, దళితుల వ్యతిరేకి చంద్రబాబు. దళితులను చంద్రబాబు ఊచకోత కోశారు. దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌పై దాడులు చేయిస్తావా? ప్రశ్నించిన మాపై దాడులు చేయటం ఏంటి? మరో కారంచేడును చేయాలని చూస్తున్నారా?. అమరావతిలో దళితులు ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసులు వేయించాడంటేనే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటాం.

చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న సైతాన్‌. దళితులను, ప్రాంతాలను, కులాలను విడదీసే నీచుడు చంద్రబాబు. 2024లోనూ దళితుల నియోజకవర్గాల్లో చంద్రబాబుకు నో ఎంట్రీ. రాష్ట్రవ్యాప్తంగా చంద్రాబాబుకు నిరసన సెగ తప్పదు. దళితులు ఎదిగే సమయంలో చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. చంద్రబాబు, లోకేష్‌ను దళిత జాతి క్షమించదు.’ అని జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు.
చదవండి: దెబ్బకు దిమ్మతిరిగింది.. చంద్రబాబుకు ‘సర్వే’ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement