బొలిశెట్టి సత్యనారాయణకు షాకిచ్చిన జనసేన | Janasena Big Shock To bolisetty satyanarayana | Sakshi
Sakshi News home page

బొలిశెట్టి సత్యనారాయణకు షాకిచ్చిన జనసేన

Mar 25 2026 12:45 PM | Updated on Mar 25 2026 2:45 PM

Janasena Big Shock To bolisetty satyanarayana

సాక్షి, విజయవాడ: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణకు బిగ్‌ షాక్‌ తగిలింది. సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేని తాజాగా జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల విశాఖలో పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. కొల్లేరులో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అయితే, కొద్దికాలంగా కూటమిలో టీడీపీ చేస్తున్న అన్యాయాన్ని బొలిశెట్టి ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూటమి పార్టీ అయిన జనసేన దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో, బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి సంబంధం లేదని జనసేన ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పార్టీకి సంబంధంలేదని తేల్చి చెప్పింది.

పార్టీ నిర్ణయంపై బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన..‘​పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

​మనల్ని కలిపిన, మనం కలిసి పనిచేద్దాం అనుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ, పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు. ముఖ్యంగా కొల్లేరు సరస్సు రక్షణ విషయంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మరియు భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నందున మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను.

​అలాగే, పర్యావరణ ప్రభావ అంచనాలు (Environmental Impact Assessment) లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి (Land Use Conversion) వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో మీ వంతు బాధ్యతను మీరు చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత సిద్ధాంతాలకు మరియు సామాజిక బాధ్యతకు విలువనిస్తూ నా నిర్ణయాన్ని ఆమోదించిన మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు’ అని వ్యాఖ్యలు చేశారు. 
 

అయితే, అంతకుముందే బొలిశెట్టి సత్యనారాయణ కొల్లేరు విషయమై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్విట్టర్‌ వేదికగా..‘కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా?. కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం!. సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది..

ఆక్రమణలను తొలగించకుండా, కనీస శాస్త్రీయ హైడ్రాలజీ అధ్యయనం లేకుండా ₹2,952 కోట్లతో 'శాలినిటీ మిటిగేషన్' పేరుతో అశాస్త్రీయ కట్టడాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఈ పనులపై స్టే ఇచ్చింది. ప్రకృతిని కాంక్రీట్ గోడలతో బంధించలేము; కొల్లేరుకు కావాల్సింది 'శాస్త్రీయ పునరుద్ధరణ'. ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల ఉపాధి హామీ పథకంగా మార్చవద్దు. కొల్లేరును దాని సహజ స్థితికి ఎలా తీసుకురావచ్చో, శాస్త్రీయ ఆధారాలు మరియు మ్యాప్స్‌తో సహా ఈరోజు ఇంటర్వ్యూలో వివరించాను.. మన పర్యావరణాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది’ అంటూ పోస్టు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement