బీఆర్ఎస్‌లో కలకలం.. కౌశిక్‌రెడ్డిపై తిరుగుబాటు? | Huzurabad BRS Leaders Secret Meeting Against Padi Kaushik Reddy | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌లో కలకలం.. కౌశిక్‌రెడ్డిపై తిరుగుబాటు?

Mar 21 2026 12:10 PM | Updated on Mar 21 2026 12:36 PM

Huzurabad BRS Leaders Secret Meeting Against Padi Kaushik Reddy

సాక్షి, కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్‌ బీఆర్ఎస్‌లో కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్‌లో రహస్య సమావేశం సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామాలు చేయడానికి  బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకే భేటీ అంటూ ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది.

సీనియర్ నాయకులు, మండల స్థాయి నేతలతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదనే చర్చ సాగుతోంది. పార్టీ మార్పా? బీఆర్ఎస్‌లోనే ఉంటూ ఎమ్మెల్యే కౌశిక్‌పై పోరాటమా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్‌లు, ఇతర నాయకులంతా వందమంది దాకా రహస్య భేటీకి హాజరయినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement