‘మీ వ్యాఖ్యలకు నవ్వొస్తుంది.. పబ్లిక్‌గా నిరూపిస్తే పోలా?’ | Himanta Sarmas wife to Gaurav Gogoi amid passport | Sakshi
Sakshi News home page

‘మీ వ్యాఖ్యలకు నవ్వొస్తుంది.. పబ్లిక్‌గా నిరూపిస్తే పోలా?’

Apr 6 2026 6:52 PM | Updated on Apr 6 2026 6:53 PM

Himanta Sarmas wife to Gaurav Gogoi amid passport

దిస్‌పూర్‌: తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై అస్సాం సీఎం హిమాంత్‌ బిశ్వా శర్మ భార్య రింకీ భుయాన్‌ శర్మ స్పందించారు.  వారికి వ్యాఖ్యలను చూస్తే నవ్వొస్తుందన్నారు.  అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు రాజకీయ దురద్దేశంతో మాత్రమే చేశారనే విషయం అర్ధమైందని, అందుకే మీ ఆరోపణలు చూసి నవ్వొస్తుందన్నారు.  

మీ ఉత్కంఠకు తానే సమాధానమిస్తానంటూ ట్వీట్‌ చేశారు రింకీ భుయాన్‌ శర్మ.  ఆ మూడు పాస్‌పోర్టుల సాయంతో భారత బయట పలు వ్యాపారాలు చేస్తున్నానంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు.  

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ ఎంతో ఉత్కంఠతో, ఆతృతతో తనపై వ్యాఖ్యలు చేశారని, వాస్తవాలు ఉంటే 24 గంటల్లో బయటపెట్టాలన్నారు.  ‘మీకు 24 గంటలు టైమ్‌ ఇస్తున్నా. వాస్తవాలు ఉంటే బయటపెట్టండి. ఎన్నికల స్టంట్స్‌ చేయొద్దు. నాకు కానీ, నా పిల్లలు కానీ భారత బయట ఎక్కడా ఆస్తులు, వ్యాపారాలు లేవు. మీరు నిరూపించి చూపించండి’ అంటూ సవాల్‌ చేశారు. తనకు పాకిస్తాన్‌ బ్యాంక్‌లతో కూడా సంబంధాలున్నాయని కూడా కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపించారు. ‘ అవేంటో చూపించి మాట్లాడండి. ఎందుకో అంత ఆతృత.. పబ్లిక్‌ నిరూపిస్తే పోతుంది కదా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement