టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లకే రూ.10 వేలు | Goshamahal MLA Raja Singh Comments On TRS | Sakshi
Sakshi News home page

కావాలనే నాపై బురద జల్లుతున్నారు

Nov 7 2020 1:08 PM | Updated on Nov 7 2020 1:15 PM

Goshamahal MLA Raja Singh Comments On TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వరద వచ్చిన ప్రాంతాలలోని చాలా మందికి ఆర్థిక సహాయం అందించటంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని గోశామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. వరద బాధితుల ఇళ్లు కూలితే ఒక లక్ష, ధ్వంసం అయితే 50 వేలు, నీటిలో మునిగితే 10 వేల రూపాయలు అని గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ జీఓ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ నీటిలో ఉన్న ప్రాంతాలను, కూలిపోయిన ఇళ్లను బాగుచేయటంలో టీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైంది. 

10 వేల రూపాయలు టీఆర్‌ఎస్‌ నాయకుల, కార్యకర్తల ఇళ్లకే వెళ్తున్నాయి. రానున్న జీఎచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయొద్దు. కొందరు కావాలనే నాపై బురద జల్లడానికి దుష్ప్రచారం చేస్తున్నారు. పూసల్ బస్తీకి చెందిన వాళ్లు తమకు 10 వేల రూపాయలు రావడం లేదని నాకు పిర్యాదు పత్రం ఇచ్చారు’’  అని అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement