నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్‌: హరీష్‌ రావు | Ex Minister Harish Rao Satirical Comments Over CM Revanth | Sakshi
Sakshi News home page

నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్‌: హరీష్‌ రావు వ్యాఖ్యలు

Apr 10 2024 11:35 AM | Updated on Apr 10 2024 1:49 PM

Ex Minister Harish Rao Satirical Comments Over CM Revanth - Sakshi

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని హస్తంలాగా తయ్యారైందని ఎద్దేవా చేశారు. 

కాగా, హరీష్‌ రావు బుధవారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భండా ఆయన మాట్లాడుతూ..‘ఇటీవల కేసీఆర్‌ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో ఏవోవో వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్‌ లీడర్‌వా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్‌ ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారు. 

Video Credit: Telugu Scribe

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పాల పొంగులాగా ఉంది. రాష్ట్రంలో ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్‌ పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకురాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. 

Video Credit: Telugu Scribe

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement