జై షాను టార్గెట్‌ చేసిన డీఎంకే.. జేపీ నడ్డాకు అదిరిపోయే కౌంటర్‌!

DMK counter Attack To JP Nadda Political Comments In Tamil Nadu - Sakshi

కేంద్రంలో అధికారంలో ఉ‍న్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్‌ చేసి అవసరమైన చోట ఆపరేషన్‌ కమల్‌తో ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు.. పాలిటక్స్‌లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. 

అయితే, తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళ పాలిటిక్స్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. కాగా, జేపీ నడ్డా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం తమిళనాడు పర్యటనలో భాగంగా జేపీ నడ్డా.. స్టాలిన్‌ సర్కార్‌ నూతన విద్యావిధానం, నీట్‌ను వ్యతిరేకించడంపైనా మండిపడ్డారు. చదువు రాని వాళ్లు పాలిస్తే ఇలాగే ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాలనపై సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా వ్యాఖ్యలకు డీఎంకే గట్టి కౌంటర్‌ ఇచ్చింది. 

వారసత్వ రాజకీయాలపై డీఎంకే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడిని టార్గెట్‌ చేసింది. ఈ క్రమంలోనే.. అసలు జైషా ఎవరు..? క్రికెట్‌ ఆయన ఎన్ని సెంచరీలు కొట్టారు..? ప్రశ్నల వర్షం కురిపించింది. దేశంలో అత్యంత సంపదతో కూడుకున్న బీసీసీఐకి జైషా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. అలాగే.. దేశంలో బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ విషయంలో తమిళులు.. తెలివైన వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ది చెబుతరాని పేర్కొంది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top