అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్‌

Published Sun, May 5 2024 9:43 PM

Dk Shivakumar Slaps Congress Worker Again

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.

దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్‌ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్‌ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement